కార్తికి నిరాశ మిగిల్చిన మైల్స్టోన్ మూవీ
సూర్య తమ్ముడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కార్తి మొదటి సినిమా పరుత్తి వీరన్తోనే మంచి హిట్ కొట్టి, అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను ఇంప్రెస్ చేశాడు. ఆ తర్వాత ఆవారా, ఊపిరి, ఖాకి, సర్దార్ ఇలా తన కెరీర్లో ఎన్నో మంచి సూపర్హిట్లు అందుకున్నాడు. సినిమా సినిమాకు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తన కెరీర్ ను సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాడు కార్తి.
ఇంతటి క్రేజ్ సంపాదింకున్న కార్తి నుంచి 25వ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో మామూలుగానే మంచి అంచనాలుంటాయి. కార్తీ తన 25వ సినిమాగా జపాన్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆడియన్స్ అంచాలను అందుకోవడంలో విఫలమైంది. దీపావళికి తెలుగులో పెద్దగా వేరే సినిమాలేవీ లేకపోవడంతో జపాన్ మంచి హిట్ అవుతుందనుకున్నారు.
అన్నీ బాగుండి జపాన్ కు మంచి టాక్ వస్తే కార్తి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచేది. కానీ టాక్ పూర్తి నెగిటివ్గా రావడంతో ట్రైలర్ లో బాగా అనిపించిన సన్నివేశాలు కూడా సినిమాలో తేలిపోయాయి. కార్తి యాక్టింగ్ బాగా ఉన్నప్పటికీ, కథలో బలం లేనప్పుడు తను మాత్రం ఏం చేయగలడు? ఏదేమైనా కార్తి మైల్స్టోన్ సినిమాగా జపాన్ చిత్రాన్ని చేయడం ఫ్యాన్స్ తీసుకోలేకపోతున్నారు.













