అది ఎంతమాత్రం నిజం కాదు : కరీనా
కరీనాకపూర్, సైఫ్ అలీఖాన్‌ల ముద్దుల కొడుకు తైమూర్ అలీ ఖాన్ కూడా సెలబ్రిటీ అయిపోయాడు. ఎంత క్రేజ్ అంటే తైమూర్‌ను పోలిన బొమ్మలను తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. తైమూర్ త్వరలోనే సినిమాల్లోకి అడుగు పెట్టేస్తాడు అనుకుంటున్నారంతా. ఎప్పుడో ఎందుకు తన తల్లి నటిస్తున్న గుడ్‌న్యూస్ చిత్రం తోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై కరీనా సృష్టత ఇచ్చింది. అది ఎంతమాత్రం నిజం కాదు. అయినా వాడు ఎందుకు నటిస్తాడు? అంటోంది కరీనా. ఆమె నటిస్తున్న అంగ్రేజీ మీడియం చిత్రీకరణ లండన్‌లో జరగుతోంది. ఇర్ఫాన్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో కరీనాది ఓ కీకల పాత్ర.













