రాజకీయాలపై కరీనా క్లారిటీ
సినిమా ఇండస్ట్రీ వారు రాజకీయాల్లోకి వెళ్లడం కొత్తేమీ కాదు. ఇలా రాజకీయాల్లోకి వెళ్లి కొందరు సక్సెస్ అయితే కొందరు మాత్రం రాజకీయాల్లో రాణించలేక తిరిగి సినిమాల్లోకి వచ్చేశారు. పార్లమెంట్ ఎన్నికలు జరిగే ప్రతిసారి కూడా బాలీవుడ్ నుండి రాజకీయాల్లోకి ఎవరో ఒకరు వెళ్తూనే ఉంటారు. ఈసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బోపాల్ నుండి కరీనాకపూర్తో పోటీ చేయించేందుకు కాంగ్రెస్ వారు ప్రయత్నాలు చేస్తున్నారంటూ జాతీయ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మీడియాలో తన గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది కరీనా కపూర్. తాను ఏనాడు రాజకీయాల గురించి ఆలోచించలేదని, తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని ఆమె పేర్కొంది. తనను ఎవరూ కూడా రాజకీయాల్లోకి ఆహ్వానించలేదని, ఏ పార్టీ వారు కూడా సంప్రదించలేదని చెప్పింది. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమా ఇండస్ట్రీపైనే ఉందని కరీనా కపూర్ సృష్టం చేశారు.













