Kanthara Chapter2: కాంతార2 వెయిటింగ్ తప్పేలా లేదు!

రిషబ్ శెట్టి(Rishab Shetty) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా కాంతార(Kanthara). 2022లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకోవడమే కాకుండా విపరీతమైన అంచనాలను అందుకుంది. దీంతో మేకర్స్ ఈ సినిమాకు ప్రీక్వెల్ ను తీశారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార చాప్టర్1(Kanthara Chapter1) సినిమాకు కూడా ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది.
అయితే కాంతార1 హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో ఈ సినిమా తర్వాత భాగం కాంతార2(kanthara2) ఎప్పుడెప్పుడు రానుందా అని కన్నడ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుండగా, దానికి చాలానే టైమ్ పట్టేట్టు తెలుస్తోంది. రిషబ్ శెట్టి ప్రస్తుతం తన గత కమిట్‌మెంట్స్ తో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ వర్మ(Prasanth Varma) తో జై హనుమాన్(Jai Hanuman), అశ్విన్ గంగరాజు(Aswin Gangaraju)తో ఓ పీరియాడికల్ డ్రామాతో పాటూ బాలీవుడ్ లో ఛత్రపతి శివాజీ(Chatrapathi Sivaji) సినిమా చేయాల్సి ఉంది.
ఈ మూడు సినిమాలు పూర్తి కావడానికి ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుంది. పైగా కాంతార2 తీయాలంటే కాన్సెప్ట్ రెడీగా ఉన్నా, ఫుల్ స్క్రిప్ట్ ఇంకా రెడీ అవలేదు. కాంతార2ను ఆడియన్స్ ఊహించిన విధంగా కాకుండా మరింత కొత్తగా తీయాలంటే దానికి కాస్త సమయం అవసరమవుతుందని భావిస్తున్న రిషబ్ శెట్టి, కాస్త టైమ్ తీసుకుని అయినా దాన్ని మరింత గ్రాండ్ గా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. కాబట్టి కాంతార2 కోసం మూడేళ్ల నిరీక్షణ తప్పేలా కనిపించడం లేదు.