కన్నప్ప రిలీజ్ టార్గెట్ ఫిక్స్?
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం కన్నప్ప. విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న ఈ సినిమా మొదట సాదా సీదా సినిమాగా మొదలైనప్పటికీ ఇందులో పలు భాషల నుంచి పలువురు స్టార్లు నటిస్తుండటం వల్ల సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. ముఖేష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శివుడిగా కనిపించనున్నాడు. మోహన్ లాల్, నయనతార, శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నారు. రీసెంట్ గా న్యూజిలాండ్ లో కీలక షెడ్యూల్ జరుపుకున్న కన్నప్ప సినిమాకు ప్రభాస్ ఇప్పటికే డేట్స్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ నెల రెండో వారం నుంచి మొదలయ్యే షెడ్యూల్ లో ప్రభాస్ జాయిన్ కాబోతున్నట్లు సమాచారం.
అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ పై ఫిల్మ్ నగర్ లో ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. కన్నప్ప సినిమాను దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. రిలీజ్ కు ముందు సినిమాను అన్ని భాషల్లో అక్కడి లోకల్ స్టార్స్ తో ప్రమోట్ చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నాడట మంచు విష్ణు. దసరా కు కన్నప్ప లాంటి భక్తి చిత్రం వస్తే ఆడియన్స్ బాగా ఆదరిస్తారన్న నమ్మకంతో విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానున్నట్ల సమాచారం.













