కంగువకు పోటీ బాగానే ఉందిగా
ఏదైనా పాన్ ఇండియా సినిమా రిలీజవుతుందటే దానికి ముందు కానీ వెనుక కానీ పోటీగా రావడానికి నిర్మాతలు రిస్క్ చేయరు. అలాంటిది నేరుగా క్లాష్ అయితే ఎంతో ఆలోచిస్తారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) హీరోగా రూపొందిన కంగువ(Kanguva) సినిమా కూడా అలా పోటీ లేకుండానే రావాలనుకుంది. కానీ సూర్యకి పోటీగా వేరే సినిమాలు రెడీ అవుతున్నాయి.
కంగువ రిలీజ్ అవుతున్న నవంబర్ 14న వరుణ్ తేజ్(Varun Tej) మట్కా(Matka) కూడా రిలీజ్ కానుంది. వరుణ్ ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ మట్కా సినిమాకు టీజర్ రిలీజయ్యాక హైప్ బాగానే పెరిగింది. కరుణ కుమార్(Karuna Kumar) ఈ సినిమాను మంచి ఇంటెన్స్ మాఫియా డ్రామాగా తెరకెక్కించాడని ఇన్సైడ్ టాక్. గల్లా అశోక్(Galla Ashok) హీరోగా రూపొందిన దేవకీ నందన వాసుదేవ(Devaki Nandana Vasudeva) కూడా అదే రోజున రిలీజ్ కానుంది.
హనుమాన్(Hanu man) డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma) అందించిన కథ కావడంతో ఈ సినిమాకు మంచి క్రేజే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాలూ కంగువకి స్పీడ్ బ్రేకర్లులా మారడం ఖాయం. వీటితో పాటూ శాండల్‌వుడ్ నుంచి శివరాజ్ కుమార్(Sivaraj Kumar) భైరతి రణగల్(Bhairathi Ranagal) రిలీజ్ కానుంది. కాకపోతే ఈ సినిమా నవంబర్ 15న రిలీజ్ కానుండటం కంగువకు కాస్త ఊరటనిచ్చే అంశం. ఇవే కాకుండా హాలీవుడ్ సినిమా గ్లాడియేటర్2(Gladiator2) కూడా బరిలో ఉంది. బాలీవుడ్ వివాదాస్పద చిత్రం ది సబర్మతి రిపోర్ట్(The sabarmathi Report)ని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. మరి ఇన్ని సవాళ్ల మధ్యలో కంగువ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.













