కంగనకు బీజేపీ గ్రీన్ సిగ్నల్
భారతీయ జనతా పార్టీలో చేరుతానన్న బాలీవుడ్ నటి కంగన రనౌత్‌కు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే తాను బీజేపీలో చేరుతానని ఆమె చెప్పిన నేపథ్యంలో నడ్డా ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వడంపై సంప్రదింపుల తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. హిమాచల్ శాసన సభ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరిద్దరూ మాట్లాడారు. కంగన రనౌత్ మా పార్టీలో చేరాలనుకుంటే ఆమె కు స్వాగతం. పార్టీలో కలిసి పని చేయాలనునే వారెవరికైనా మంచి అవకాశం ఉంటుందన్నారు.













