కమల్ కల్కి గెటప్‌పై చర్చలు
ఎన్నో అంచనాల మధ్య రిలీజైన కల్కి 2898ఏడీ ట్రైలర్ అంచనాలను మించి వ్యూస్ పరంగా దూసుకెళ్తూ రికార్డులు సృష్టిస్తోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ చూపించిన కొత్త ప్రపంచాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సినిమా సెట్స్ పై ఉన్నన్ని రోజులు ఎలాంటి లీక్ బయటికి రాకుండా జాగ్రత్త పడిన టీమ్, ట్రైలర్ తో ఆడియన్స్ కు గూస్బంప్స్ తెప్పించారు.
ట్రైలర్ చూస్తుంటే సినిమా హాలీవుడ్ రేంజ్ కు ఏ మాత్రం తగ్గదనిపిస్తుంది. మహానటి తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న నాగ్ అశ్విన్ కల్కి కోసం తపస్సు చేశాడు అనే రేంజ్ లో ట్రైలర్ ఉంది. అయితే ట్రైలర్ లో కమల్ హాసన్ గెటప్ గురించి ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతుంది. కమల్ ట్రైలర్ లో కనిపించింద రెండు మూడు షాట్స్ లోనే అయినా వయసు మళ్లిన గెటప్ లో ఇండియన్2 సినిమాలో ఉన్నట్లే కనిపించాడనే కామెంట్ వినిపిస్తుంది.
ఇండియన్2లో కమల్ గెటప్‌కి, కల్కి లో కమల్ గెటప్ కు చాలా దగ్గర పోలికలున్నాయి. తన కథకు సెటయ్యేలా ఉన్నాడు కాబట్టి గెటప్ లో చిన్న చిన్న మార్పులు చేసి నాగ్ అశ్విన్ కమల్ ను వాడుకున్నాడా లేక ఈ సినిమాకు ఆయన గెటప్ అలానే కావాలని ఉంచాడా అనేది సినిమా చూస్తేనే ఓ క్లారిటీకి రాగలం. కల్కి ఫస్ట్ పార్ట్ లో కమల్ కనిపించేది కేవలం అరగంటే అని, సెకండ్ పార్ట్ లో ఎక్కువ సేపు ఉంటాడని ఇప్పటికే లీకైంది. ఏదేమైనా జూన్ 27న రిలీజ్ కానున్న కల్కి సినిమాతో మళ్లీ థియేటర్లు కళకళలాడిపోవడం ఖాయమని రీసెంట్ గా రిలీజైన ట్రైలరే చెప్తుంది.













