5 నిమిషాల్లో కమల్ విధ్వంసం
కల్కి సినిమాలోని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లలో కమల్ హాసన్ చేసిన సుప్రీమ్ యాస్కిన్ పాత్ర ముందుంటుంది. రిలీజ్ కు ముందు కమల్ చేసిన ఈ క్యారెక్టర్ మీద పెద్దగా హైప్ లేదు. కానీ సినిమా చూశాక దాని ఇంపాక్ట్ బాగా కనిపిస్తుంది. కల్కిలో కమల్ క్యారెక్టర్ కు స్క్రీన్ టైమ్ చాలా తక్కువ. మహా అయితే సినిమా మొత్తమ్మీద 5 నిమిషాలు కనిపిస్తాడేమో అంతే.
ఆ 5 నిమిషాల్లో రెండుసార్లు రెండు సీన్స్ లో కమల్ మెరుస్తాడు. సినిమాలో కమల్ చేసిన యాస్కిన్ క్యారెక్టర్ ఆడియన్స్ కు ఒళ్లు గగుర్పొడిచేలా భయాన్ని కలిగించింది. ఫస్ట్ సీన్ లో అయితే అసలు స్క్రీన్ పై ఉన్నది కమల్ అనే ఆలోచన కూడా ఎవరికీ రానంత వింతగా అస్థిపంజరంలా కనిపించాడు. దాంతో పాటూ ఆయన గొంతుతో కూడా ఆ పాత్రపై ఓ రకమైన భయాన్ని క్రియేట్ చేయగలిగాడు.
ఇక లాస్ట్ సీన్ లో ఆయన గెటప్ మారి కమల్ లానే కనిపించాడు. ఆ సీన్ లో కమల్ చెప్పిన డైలాగులు విన్న తర్వాత కల్కి2లో ఆయన పాత్ర మీద అంచనాలు పెరగడం ఖాయం. కేవలం5 నిమిషాలకే ఈ రేంజ్ క్రేజ్ సృష్టించగలిగిన యాస్కిన్ పాత్ర సినిమా మొత్తం ఉంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి తోడు కమల్ పాత్ర ఈసారి నేరుగా ప్రభాస్ పాత్రతో తలపడనుంది. వీరిద్దరి మధ్య జరిగే పోరు కల్కి2 మీద ఉన్న అంచనాలను ఇంకా పెంచేస్తుంది.













