Kamal Hassan: కన్నడ భాషపై కమల్ షాకింగ్ కామెంట్స్

లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Hassan) హీరోగా నటించిన తాజా సినిమా థగ్ లైఫ్(Thug Life). లెజండరీ డైరెక్టర్ మణిరత్నం(Mani Ratnam) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ చిత్ర ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఓ ఈవెంట్ లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్(Siva raj Kumar) గురించి కమల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారి తీశాయి.
కన్నడ భాష కూడా తమిళ భాష నుంచే పుట్టిందని కమల్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. శివ రాజ్ కుమార్ కూడా తన కుటుంబమే అని ఎందుకంటే కన్నడ భాష పుట్టుకొచ్చింది తమిళం నుంచే అని అందుకే తాను అలా అన్నానంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు కన్నడ అభిమానుల ఆగ్రహానికి కారణంగా మారాయి.
కర్ణాటక ప్రాంతీయులకు అసలే భాషపై ఎంతో ప్రేమ, అభిమానం. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై ఎన్నో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. మొన్నటి మొన్న రష్మిక(Rashmika) తమ ప్రాంతాన్ని పట్టించుకోకుండా మాట్లాడిందని ఎంత పెద్ద రచ్చ చేశారో తెలుసు. అలాంటి కన్నడ ప్రాంతీయులను తమ భాష తమది కాదనేలా కమల్ మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మరి ఈ విషయంలో కమల్ ఏమైనా స్పష్టత ఇస్తారేమో చూడాలి.