కమల్ తన డెసిషన్ను మార్చుకున్నాడా?
భారీ అంచనాల మధ్య రిలీజైన ఇండియన్2 డిజాస్టర్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయుంటే ఆరు నెలల్లోపే ఇండియన్3ను రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేసుకుంది. ఇప్పటికే ఇండియన్3కు సంబంధించిన షూటింగ్ ను ఆల్మోస్ట్ ఫినిష్ చేశాడు శంకర్. మరో రెండు మూడు వారాల ప్యాచ్ వర్క్ చేస్తే ఇండియన్3 షూటింగ్ పూర్తవుతుంది. అయితే ఇండియన్2 డిజాస్టర్ అవడంతో కమల్ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇండియన్2 మీద బాగా నెగిటివిటీ రావడంతో దానికి సీక్వెల్ ను కాస్త వెయిట్ చేసి చూద్దామని లైకా నిర్మాతలు చెప్పినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో కమల్ థగ్ లైఫ్ షూటింగ్ లో బిజీ కాబోతున్నాడు.
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామాని రాజ్ కమల్ బ్యానర్ మీద స్వయంగా కమల్ నిర్మిస్తున్నాడు. ఇండియన్3 ప్లేస్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని కమల్ ఆలోచిస్తున్నాడట. సొంత బ్యానర్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ సినిమాను మణిరత్నం ఎంత ఫాస్ట్ గా పూర్తి చేయగలడే దాని మీద థగ్ లైఫ్ రిలీజ్ డేట్ ఆధారపడి ఉంటుంది. కల్ట్ క్లాసిక్ గా ఉన్న ఇండియన్ సినిమా బ్రాండ్ ను అనవసరంగా పాడు చేశారని శంకర్ మీద కమల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.













