‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్
2018 కి రెడీ అవుతున్న ‘ రోబో 2.0 ’ సినిమా కోసం రజనీ ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. దీని తర్వాత శంకర్ ఏ సినిమా చేస్తాడనే ఉత్సుకత చాలా మందిలో నెలకొని వుంది. తనెప్పటి నుంచో ఉవ్విళ్ళూరిస్తున్న ‘ భారతీయుడు ’ సినిమాకు సీక్వెల్ తేవాలనే వార్త నిజమవనుంది. లంచగొండితనంపై ఓ సామాన్యుడు చేసిన పోరాటాన్ని ‘భారతీయుడు’లో చూశాం. కమల్‌హాసన్ నటన, శంకర్ దర్శకత్వ పటిమకు ఆ చిత్రం నిదర్శనంగా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘ఇండియన్ 2’ రాబోతోంది. కమల్ – శంకర్ ద్వయం మళ్లీ ఈ సినిమా కోసం కలసి పనిచేయబోతున్నారు. దిల్‌రాజు నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో నిర్మిస్తారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘మా సంస్థ నుంచి రాబోతున్న ప్రతిష్ఠాత్మక చిత్రమిది. ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఓ సమస్య నేపథ్యంలో కథ నడుస్తుంది. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుంది. ప్రస్తుతం శంకర్ ‘2.ఓ’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే ‘ఇండియన్ 2’ సెట్స్‌పైకి వెళ్తుంది. తెలుగు, తమిళంలోనే కాదు మిగిలిన భారతీయ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు













