Kamal Hassan: ఆస్కార్ కమిటీలో కమల్‌కు సభ్యత్వం.. ఇండియన్ సినీ ఇండస్ట్రీకే గర్వకారణం

ఇండియన్ నటులు కమల్ హాసన్ (Kamal Hassan), ఆయుష్మాన్ ఖురానా గ్లోబల్ క్లబ్ లో చోటు దక్కించుకున్నారు. ఈ లెజెండ్స్ ఇద్దరికీ ఆస్కార్ అకాడమీలోకి ఆహ్వానం లభించింది. దీంతో ఎంతోమంది హాలీవుడ్ నటీనటులతో పాటూ ఆస్కార్ ఓటింగ్ ప్రక్రియలో మన భారతీయ నటులు కూడా భాగమయ్యారు. తాజాగా ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ ఇయర్ ఆస్కార్ అకాడమీలో చోటు పొందిన వారిని అనౌన్స్ చేసింది.
రిలీజ్ చేసిన ఆ లిస్ట్ లో కమల్ హాసన్, ఆయుష్మాన్ ఖురానాతో పాటూ డైరెక్టర్లు పాయల్ కపాడియా, ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ మాక్సిమా బసు కూడా ఉన్నారు. ఆస్కార్ కు ఎంపికయ్యే సినిమాల్లో ఆఖరి ఎంపిక ప్రకయలో వీరికి ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది. ఈ ఇయర్ అకాడమీ కొత్తగా 534 మందిని ఆహ్యానించగా, వారిలో కమల్ హాసన్ కూడా నిలిచారు.
విశ్వ నటుడు కమల్ హాసన్ కు ఈ అరుదైన గౌరవం దక్కడం అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఈ విషయంలో పలువురు కమల్ కు అభినందనలు తెలుపుతై, ఇండియన్ సినీ ఇండస్ట్రీకే ఇది గర్వకారణమని ఆయన్ను కొనియాడుతున్నారు. ఆరు దశాబ్దాలకు పైగా అద్భుతమైన యాక్టింగ్ కెరీర్ తో, కమల్ ఓ నటుడిగా కంటే ఎంతో ఎక్కువని, ఆయన సినిమాపై చూపిన ప్రభావం ఇండియన్ సినీ ఇండస్ట్రీపైనే కాకుండా ప్రపంచ సినిమాపై కూడా చెరగని ముద్ర వేసిందని పవన్ కల్యాణ్ అన్నారు.