కమల్, శృతి కలయికలో సినిమా
కమల్ హాసన్ పనైపోయిందని అంతా అనుకుంటున్న టైమ్ లో విక్రమ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. విక్రమ్ తర్వాత కమల్ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. విక్రమ్ ఇచ్చిన సక్సెస్ జోష్తో కమల్ తన సొంత బ్యానర్లో కూడా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఈ బ్యానర్ నుంచి ఓ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు.
ఈ సినిమా కోసం కమల్ కూతురు శృతి హాసన్ కూడా వర్క్ చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అయితే వీరిద్దరూ కలిసి ఈ సినిమా కోసం నటించడం లేదు. ఈ సినిమా సంగీత బాధ్యతలు శృతి హాసన్ తీసుకోనుందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు కమల్ టీమ్ ప్రకటించారు.
ఇదిలా ఉంటే తాజాగా ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్స్ కు శృతి రిప్లై ఇస్తూ ఈ సినిమా గురించి చెప్పుకొచ్చింది. రీసెంట్ గా అనౌన్స్ చేసిన సినిమా మ్యూజికల్ ప్రాజెక్ట్ అని దానికి సంబంధించిన వివరాలు అతి త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొంది. అంతేకాదు, ఈ సినిమా కోసం తానెంతో వెయిట్ చేస్తున్నట్లు కూడా శృతి తెలిపింది. గతంలో ఈనాడు సినిమా కోసం మ్యూజిక్ టెక్నీషియన్ గా వర్క్ చేసిన శృతి హాసన్, ఇప్పుడు ఏకంగా మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేయనుందన్నమాట.













