డెవిల్ సెన్సార్ రిపోర్ట్
కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం డెవిల్. డిసెంబర్ 29న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. బ్రిటీష్ ఇండియాలో పనిచేసే ఇండియన్ సీక్రెట్ ఏజెంట్‌గా డెవిల్ లో కళ్యాణ్ రామ్ కనిపించనున్నాడు.
సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో మాళవిక నాయర్ కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు చిత్ర బృందం తెలిపింది. ట్రైలర్‌తో అంచనాలు పెంచుకున్న ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజు కూడా భాగమయ్యాడు.
గతేడాది బింబిసారతో బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్, తర్వాత అమిగోస్ తో ఫ్లాపు ను మూట గట్టుకున్నాడు. దీంతో ఇప్పుడు తన ఆశలన్నీ డెవిల్పైనే పెట్టుకున్నాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై ఆడియన్స్‌కు కూడా మంచి అంచనాలున్నాయి. నిర్మాతగా సక్సెస్ అయిన అభిషేక్ నామా డైరెక్టర్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.













