డెవిల్కు ఆ ప్రాబ్లమ్ లేనట్టే!
సలార్ లాంటి ఫుల్ హైప్ ఉన్న సినిమా వస్తుందంటే ఆ ముందు, వెనుక వారాల్లో కూడా కొత్త సినిమాలను రిలీజ్ చేయడానికి మేకర్స్ ఆలోచిస్తారు. సలార్ కు తోడు డంకీ కూడా అదే వారానికి షెడ్యూల్ అవడంతో ముందు వారం ఏవో చిన్న సినిమాలు తప్పించి, క్రేజ్ ఉన్న సినిమాలేవీ రిలీజ్ కాలేదు. అయితే తర్వాతి వారానికి మాత్రం డెవిల్తో పాటూ బబుల్గమ్, సర్కారు నౌకరి, వ్యూహం సినిమాలు షెడ్యూల్ అయ్యాయి.
వీటిలో అన్నింటికంటే ఎక్కువ క్రేజ్ ఉన్న మూవీ అంటే డెవిల్. ఆ సినిమా మీద నమ్మకంతో ప్రొడ్యూసర్, బయ్యర్లు చాలానే పెట్టుబడి పెట్టారు. సలార్, డంకీ సినిమాలు రిలీజైన వారానికే ఈ సినిమా వస్తుంది కాబట్టి మొదట్లో డెవిల్కు థియేటర్ల దొరుకుతాయో లేదోనని అనుమానపడ్డారు. కానీ ఈ సినిమాల రిలీజ్ తర్వాత ఆ భయాలు మొత్తం పోయినట్లే కనిపిస్తోంది.
రెండో వారంలో డంకీ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఇక సలార్ కు మిక్డ్స్ టాక్ రావడంతో వీకెండ్ వరకు కలెక్షన్ల మోత మోగుతాయి. తర్వాత డివైడ్ టాక్ ప్రభావం కనిపించే ఛాన్సుంది. ఒకవేళ రెండో వారంలో కూడా సలార్ హవా కొనసాగించినా ఆ వారం రిలీజయ్యే సినిమాలకు అది పెద్దగా ఎఫెక్ట్ కాకపోవచ్చు. ఏదేమైనా సలార్, డంకీ సినిమాల టాక్ డెవిల్కు మంచి రిలీఫ్ ని ఇచ్చింది.













