కళ్యాణ్ రామ్ తో పవన్ క్రేజీ మల్టీస్టారర్
కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడనుకుంటే మరెప్పటికో సెట్స్ పైకి వెళ్తుంటాయి. అలాంటి వాటిలో నందమూరి కళ్యాణ్ రామ్- పవన్ సాధినేని కాంబో కూడా ఒకటి. వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందని ఎప్పుడో అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ ఆ సినిమా మాత్రం సెట్స్ పైకి వెళ్లలేదు. తన మొదటి సినిమా ప్రేమ ఇష్క్ కాదల్తోనే డిఫరెంట్ మార్క్ చూపించిన పవన్, ఆ తర్వాత చేసిన సినిమాలతో పెద్దగా అలరించలేకపోయాడు.
మళ్లీ ఈ మధ్య వెబ్ సిరీస్లు చేస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు. సేనాపతితో తన టాలెంట్ చూపిన పవన్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. ఇప్పుడు మళ్లీ తనకు వరుస ఆఫర్లొస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా కళ్యాణ్ రామ్ తో పవన్ సాధినేని మూవీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల కిందటే ఈ కాంబోలో సినిమా రావాల్సింది కానీ ఎందుకో అప్పుడు వర్కవుట్ అవలేదు.
మళ్లీ ఇన్నాళ్లకు వీరి కాంబోలో మూవీ రానుంది. కళ్యాణ్ రామ్ కోసం పవన్ రెడీ చేసిన స్టోరీలో హరికృష్ణకు కూడా ఓ కీలక పాత్ర ఉందట. ఆ ప్రాజెక్ట్ లేట్ కావడంతో కాంబో సెట్ కాలేదు. ఇప్పుడు అదే స్టోరీతో పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడని, హరికృష్ణ కోసం అనుకున్న పాత్రలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. క్రేజీ మల్టీస్టారర్ గా రాబోతున్నఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుందని సమాచారం.













