డెవిల్ కోసం దేవర నిర్ణయం
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వచ్చే వారం టీజర్ రిలీజ్ కానుందని గత రెండు మూడు రోజులుగా నెట్టింట తెగ ప్రచారమవుతుంది. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అసలు ఇప్పటివరకు టీజర్ వీడియోను ఎడిటింగే చేయలేదని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి.
ఈ నెల 29 కళ్యాణ్ రామ్ నటిస్తున్న డెవిల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఆ సినిమా రిలీజయ్యే వరకు దేవరకు సంబంధించిన అప్డేట్స్ వదలాలనుకోవడం లేదట దేవర మేకర్స్. ఒకవేళ దేవరకు సంబంధించిన ఏదైనా కంటెంట్ రిలీజైతే అటెన్షన్ మొత్తం దానివైపే వెళ్తుందని, ఈ విషయంలో ఫ్యాన్స్ ను డైవర్ట్ చేయకూడదని నిర్ణయించుకున్నారట.
వచ్చే వారం దేవర టీజర్ రాకపోయినా సంక్రాంతికి మాత్రం దేవర టీజర్ రిలీజవడం పక్కా. డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ టైమ్, డేట్ చూసుకుని దేశవ్యాప్తంగా ఒక్కసారిగా టీజర్‌తోనే హైప్ పెంచేలా టీజర్ ను కట్ చేస్తున్నారట. టీజర్ లో హీరో క్యారెక్టర్ ను పరిచయం చేసి, సముద్రపు బ్యాక్ డ్రాప్ లో దేవర ప్రపంచం ఎలా ఉండబోతుందనో కూడా చూపించబోతున్నారట. ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ జనవరి నుంచి ప్రమోషన్స్ ను వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది.













