Kalyan Ram: ఎన్టీఆర్ లైనప్ పై కళ్యాణ్ రామ్ ఏమంటున్నారంటే
ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో మొదటిది వార్2(War2). హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి ఎన్టీఆర్ చేసిన వార్2 ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే వార్2 షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం నీల్(Neel) సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ నీల్ సినిమా డ్రాగన్(Dragon) సెట్స్ లో జాయిన్ కానున్నాడు.
ఆ తర్వాత కొరటాల శివ(Koratala Siva)తో దేవర2(Devara2) చేస్తాడని కొందరంటుంటే, మరికొందరు నెల్సన్(Nelson) తో కలిసి సినిమాను చేస్తాడని మరికొందరంటున్నారు. ఎన్టీఆర్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments)నాగ వంశీ(Naga Vamsi) సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఆ సినిమా ఎప్పుడుంటుందోననే క్లారిటీ లేక ఎన్టీఆర్ ఫ్యాన్స్ సతమతమవుతున్నారు.
ఈ విషయంపై తాజాగా ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్(Kalyan Ram) క్లారిటీ ఇచ్చాడు. అర్జున్ సన్నాఫ్ వైజయంతీ(Arjun S/o Vijayanathi) ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ సినిమాలపై కళ్యాణ్ రామ్ మాట్లాడాడు. డ్రాగన్, దేవర2 సినిమాలను పూర్తి చేశాకే ఎన్టీఆర్ మరో సినిమా చేయనున్నాడని కళ్యాణ్ రామ్ వెల్లడించాడు. దీంతో నెల్సన్ సినిమా మొదలవడానికి ఇంకా టైమ్ పడుతుందనే క్లారిటీ ఫ్యాన్స్ కు వచ్చేసింది.













