అర్థ రాత్రి షోలపై కల్కి సస్పెన్స్
సినీ పరిశ్రమకు అనుకూలంగా ఉండే టీడీపీ జనసేన కూటమి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పరచడంతో ఇప్పుడు అందరి కళ్లూ జూన్ 27న రిలీజ్ కాబోతున్న కల్కి 2898ఏడీ మీదే ఉన్నాయి. కల్కి రిలీజ్ నేపథ్యంలో దానికి టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోల పర్మిషన్స్ గురించి ఇండస్ట్రీలో చాలా పెద్ద చర్చే జరుగుతుంది.
అర్థరాత్రి నుంచి ప్రీమియర్స్ వేస్తారని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు దానిపై టీమ్ ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదని తెలుస్తోంది. యుఎస్ లో ప్రీమియర్స్ అదే టైమ్ కు స్టార్ట్ కానున్నాయి. ఇండియన్ టైమ్ ప్రకారం ఉదయం నిద్ర లేచే లోపే అక్కడి రివ్యూలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే బాహుబలి, సలార్ కంటే ఎక్కువ మొత్తంలో కల్కి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడబోతున్నారు.
టాక్ పాజిటివ్ గా వస్తే కల్కికి కలిసొస్తుంది ఒకవేళ టాక్ ఏదైనా మిక్డ్స్ గా వస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ సమస్య లేకుండా ఉండాలంటే వరల్డ్ వైడ్ ఒకేసారి షోలు పడాలి. దానికంటే బెస్ట్ ఆప్షన్ మరోటి లేదు. తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ వరకు ఒంటి గంట షోలు వేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేస్తున్నారట. తెలంగాణ తో పాటూ ఏపీలో కూడా అదే టైమ్ కు షోలు పడాలి. ఈ విషయంలో ఏం చేస్తే బావుంటుందనే దానిపై ఆలోచిస్తున్నారట.













