కల్కి ఆఖిరి అరగంట… నెక్ట్స్ లెవెల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898ఏడి ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. కల్కి వరల్డ్ ఎలా ఉంటుందో, అసల కల్కి ఏం చేస్తాడనేది కల్కి ప్రీల్యూడ్ తో శాంపిల్ గా ఇప్పటికే చూపించాడు నాగ్ అశ్విన్. కల్కి యానిమేటెడ్ సిరీస్ చూసిన ఆడియన్స్ కు ఇప్పటికే సినిమాపై ఓ అంచనా వచ్చింది. అయితే కల్కి ఫస్ట్ పార్ట్ లో కేవలం పాత్రలను పరిచయం చేసి భైరవ టార్గెట్ ఫిక్స్ చేసుకోవడం వరకే చూపిస్తారని, సెకండ్ పార్ట్ కు లీడ్ ఇస్తూ ఆసక్తి పెరిగేలా సస్పెన్స్ లో కల్కి ఫస్ట్ పార్ట్ ను ముగించనున్నాడట నాగ్ అశ్విన్.
అంతేకాదు కల్కి సినిమా మొత్తం ఒకెత్తయితే చివరి అరగంట మరో ఎత్తని, ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్స్, విజువల్స్ తో క్లైమాక్స్ ఆడియన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుందంటున్నారు. ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ ఓ యానిమేషన్ కంపెనీనే రన్ చేస్తున్నాడని, ఈ సినిమాతో ప్రభాస్ హాలీవుడ్ రేంజ్ కు వెళ్లడం ఖాయమని అంటున్నారు. ఇదిలా ఉంటే కల్కిని ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.













