కళంక్ ఫస్ట్ లుక్ విడుదల
బాలీవుడ్ లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో కళంక్ ఒకటి. సూపర్‌హిట్ ఫిలిం టు స్టేట్స్ దర్శకుడు అభిషేక్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ ధావన్, ఆదిత్యరాయ్ కపూర్, సంజయ్‌దత్ హీరోలుగా నటిస్తుండగా.. అలియాభట్, సొనాక్షి సిన్హా, మాధురి దీక్షిత్ వారికి జంటగా నటిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రంలో మహిళా పాత్రధారుల ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఆలియాభట్, సొనాక్షి సిన్హా, మాధురి దీక్షిత్‌ల పాత్రలను పరిచయం చేశారు. కరణ్ జోహర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.













