షార్ట్ ఫిల్మ్ లో శ్రుతీహాసన్!
గాయనిగా, నటిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా, సంగీత దర్శకురాలీగా తనలోని విభిన్నమైన కోణాలను ప్రేక్షకులకు చూపించారు శ్రుతీహాసన్. ఇప్పుడు మరో మీడియాలోకి అడుగుపెడుతున్నట్లు తెలిసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన శ్రుతీహాసన్ తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటీమణులు కాజోల్, నేహా ధూపియా, నీనా కులకర్ణి అలాగే ముక్తా బావ్రే, రామా జోషీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రియాంకా బెనర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్‌కు దేవి అని టైటిల్ పెట్టారు. శక్తిమంతమైన సందేశంతో షార్ట్ అండ్ స్ట్రాండ్గా ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందుతోందని సమాచారం. నా తొలి షార్ట్ ఫిల్మ్‌ను ఇంత మంది ప్రతిభ కలిగిన నటీమణులతో కలసి చేయడం చాలా ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు శ్రుతీహాసన్.













