నాగార్జున సినిమాలో ఛాలెంజింగ్ రోల్ లో కాజల్
ఒకవైపు ఏజెంట్ గా కనిపించేందుకు అఖిల్ సన్నాహాలు చేస్తుంటే, మరోవైపు లేడీ రా ఏజెంట్ గా కాజల్ అగర్వాల్ కనింపించడానికి రెడీ అవుతుంది. కాకపోతే ఒకే సినిమాలో కాదులెండి. అఖిల్ తండ్రి నాగార్జున సినిమాలో కాజల్ చేసే రోల్ రా ఏజెంట్. పెళ్లి తర్వాత తన కెరీర్ స్పీడ్ పెంచిన కాజల్, కేవలం గ్లామర్ కు మాత్రమే పరిమితం కాకుండా, కథలను సెలెక్టివ్ గా ఎంచుకుంటూ తన పాత్రల్లో కొత్తదనం ఉండేలా చూసుకుంటుంది.
ప్రస్తుతం కాజల్ తెలుగులో నాగార్జున కు జంటగా, ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో ఒక యాక్షన్ సినిమాలో చేస్తుంది. ఇందులో కాజల్ రా ఏజెంట్ గా చాలా బలమైన క్యారెక్టర్ ను పోషిస్తుందట. దేశ రక్షణ కోసం ప్రాణాలకు సైతం తెగించి పోరాడే మహిళగా ఆమె పాత్ర ఎంతో ఇన్ స్పైరింగ్ గా ఉంటుందంటున్నారు.
ఎంటి ఎమోషన్స్ ను అయినా తనలోనే అణుచుకుంటూ దేశభక్తితో తన ఉద్యోగ బాధ్యతలను దైవంగా భావించే రా ఏజెంట్ పాత్రలో తన నటన సినిమాకే హైలైట్ గా నిలవనుందట. అంతేకాదు ఈ రోల్ కాజల్ కు కెరీర్ లోనే చాలా ఛాలెంజింగ్ రోల్. ఈ క్యారెక్టర్ కోసం తన బాడీ ఫిట్ నెస్ విషయాల్లో స్పెషల్ కేర్ కూడా తీసుకుంటుందట. డ్రెస్సింగ్ నుంచి, బాడీ లాంగ్వేజ్ వరకు అన్నింటిలోనూ కాజల్ కొత్తగా కనిపించనుందట. అంతేకాదు ఈ సినిమా కోసం ఆమె మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, రైఫిల్ షూటింగ్ లో కూడా ట్రైనింగ్ తీసుకుంటుందట. రీసెంట్ గా గోవాలో ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ పూర్తయింది. తర్వాతి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు. మరి రా ఏజెంట్ గా కాజల్ ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.













