హాలీవుడ్‌కు అందాల తార
హాలీవుడ్లో మన బాలీవుడ్ స్టార్లు ఇప్పటికే సత్తా చాటుతున్నారు. బాలీవుడ్ నుండి ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె తదితరులు హాలీవుడ్లో సందడి చేస్తున్నారు. కొంతమంది సౌత్ స్టార్స్‌కి కూడా ఈ అవకాశం దక్కింది. శృతిహాసన్ ఓ వెబ్ సిరీస్‌తో త్వరలో హాలీవుడ్లో అడుగుపెట్టబోతోంది. అనుష్క నటిస్తున్న సైలెన్స్ కూడా ఇంగ్లీస్‌లో విడుదల కానుందట. ఇక ఇప్పుడు అందాల తారా కాజల్ వంతు వచ్చింది. త్వరలో ఈ భామ హాలీవుడ్లో అడుగు పెట్టడం ఖాయమనిపిస్తోంది. ఓ హాలీవుడ్ దర్శకుడు కాజల్‌తో బైలింగ్వల్ మూవీకి రంగం సిద్ధం చేస్తున్నాడట. ఆంగ్ల, తెలుగు భాషల్లో ఈ సినిమా రూపొందనుందట. ఏరికోరి ఆయన కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్గా ఎంచుకున్నాడని సమాచారం.













