సత్యభామపై కాజల్ ధీమా
టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అనుభవించిన కాజల్ అగర్వాల్ కు గత కొంతకాలంగా అవకాశాలు తగ్గాయి. ఏ హీరోయిన్ కైనా ఈ పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి టైమ్ లోనే సదరు హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అందులో అందరూ సక్సెస్ అవరు. కాజల్ కు ఇప్పటివరకు అలాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలేవీ కలిసిరాలేదు.
తెలుగులో అమ్మడు చేసిన సీత సినిమా డిజాస్టర్ గా మిగిలింది. తమిళంలో చేసిన మరో సినిమా కూడా ఫ్లాప్ అయింది. అయితే ప్రస్తుతం కాజల్ కొంత గ్యాప్ తర్వాత సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసింది. ఈ సినిమా చాలా కాలం పాటు మేకింగ్ దశలోనే ఉంది. ఇప్పుడు మొత్తానికి షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయింది.
అయితే ఈ సినిమా విషయంలో కాజల్ పడుతన్న తపన చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాజల్ ఇంతకుముందెన్నడూ లేని విధంగా సత్యభామను ప్రమోట్ చేస్తుంది. అడిగిన ప్రతీ ఒక్కరికీ ఇంటర్వ్యూలు ఇస్తూ, తనకు పరిచయమున్న ప్రతి హీరోతో సినిమాను ప్రమోట్ చేయించాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ ట్రైలర్ లాంఛ్ కు గెస్టు గా వచ్చాడు. సుమన్ చిక్కాల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై కాజల్ ఎంతో నమ్మకంగా ఉంది. అందుకే సినిమాను నెక్ట్స్ లెవెల్ లో ప్రమోట్ చేస్తుంది. సత్యభామ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.













