హైదరాబాద్లో మకాం పెట్టిన కాజల్
టాలీవుడ్ చందమామ పెళ్లయ్యాక సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. దీంతో అందరూ కాజల్ రిటర్మైంట్ ఇచ్చిందనుకున్నారు కానీ బాబు పుట్టాక కాజల్ మళ్లీ సినిమాలకు రీఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఓ వైపు సీనియర్ హీరోలతో నటిస్తూనే, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ కెరీర్ ను జెట్ స్పీడ్ లో తీసుకెళ్తుంది కాజల్.
అయితే టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న కాజల్ ఎక్కడ ఉంటుంది? బాబుని ఎలా చూసుకుంటుంది అని కంగారు పడుతున్న ఫ్యాన్స్ కు రీసెంట్ గా క్లారిటీ ఇచ్చేసింది కాజల్. ప్రస్తుతం సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్న కాజల్, ఈ సినిమా కోసం తన మకాంను హైదరాబాద్కు మార్చేసినట్లు, ఇక్కడే ఉండి బాబును చూసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.
భగవంత్ కేసరి సినిమా చేస్తున్నప్పుడు సత్యభామ కథ విన్నానని, బాగా నచ్చడంతో ఈ సినిమాను చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అంతే కాదు, ఈ మూవీ కోసం మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న కాజల్, ఇలాంటి సినిమా చేయడానికి విజయశాంతి ఇన్సిపిరేషన్ అని చెప్పింది. తన కెరీర్లో ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తయితే సత్యభామ మరొక ఎత్తు అని కాజల్ చెప్పుకొచ్చింది. ఏదేమైనా కాజల్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా చాలా తెలివిగా ప్లాన్ చేసుకుందనే చెప్పాలి.













