Kaantha: దీపావళికి వాయిదా పడుతున్న కాంత?
దుల్కర్ సల్మాన్(dulquer salman) మలయాళ నటుడైనప్పటికీ తెలుగు ఆడియన్స్ కు చాలా సుపరిచితుడే. ఆయన తెలుగులో నేరుగా చేసిన మహానటి(mahanati), సీతారామం(sittaramam), లక్కీ భాస్కర్(lucky baskhar) సినిమాలకు తెలుగు ఆడియన్స్ ఏ రేంజ్ లో బ్రహ్మరథం పట్టి సూపర్హిట్లు చేశారో తెలిసిందే. అయితే లక్కీ భాస్కర్ బ్లాక్ బస్టర్ తర్వాత దుల్కర్ ప్రస్తుతం కాంత(kaantha) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా తీయడం వెనుక ఉన్న అసలు కథ ఏంటనే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో హీరో పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించనుండగా డైరెక్టర్ పాత్రలో సముద్రఖని(Samudrakhani) నటిస్తున్నారు. మద్రాస్ నేపథ్యంలో అప్పటి రోజుల్ని గుర్తు చేసేలా కనిపించిన ఇంటెన్స్ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
సెల్వమణి సెల్వరాజ్(selvamani selvaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మేకర్స్ ముందు చెప్పిన ప్రకారమైతే సెప్టెంబర్ 12న రిలీజ్ కావాలి. కానీ ఇప్పుడా సినిమా వాయిదా పడి అక్టోబర్ మూడో వారంలో దీపావళి సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భాగ్య శ్రీ బోర్సే(bhagya sri borse) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రానా(Rana) డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నాడు.







