హైదరాబాద్ లో కాలా ప్రీ రిలీజ్ వేడుక
కబాలి చిత్రం తర్వాత రజనీకాంత్ -పా రంజిత్ కాంబోలో తెరకెక్కిన చిత్రం కాలా. మురికి వాడల నేపథ్యంలో తెరకెక్కినీ చిత్రం జూన్ 7న విడుదల కానుంది. మే 9 సాయంత్రం చిత్ర ఆడియో వేడుక చెన్నైలో జరగగా, మే 29న సాయంత్రం 6 గంటలకి హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో మూవీ ప్రీ రిలీజ్ వేడుక జరుపనున్నారు. రజనీకాంత్‌కి తెలుగులోను పుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ప్రీ రిలీజ్ వేడుకని హైదరాబాద్‌లో జరిపేందుకు ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్‌కి సంబంధించి ఎవరెవరు హాజరు అవుతారో తెలియాల్సి ఉంది. సంతోష్ నారాయణ్ చిత్రానికి బాణీలు సమకూర్చిన సంగతి తెలిసిందే. కాలా చిత్రంలో రజనీ కరికాలన్ అనే గ్యాంగ్ స్టర్ పాత్ర పోషించాడు. రజనీకాంత్ భార్యగా సీనియర్ నటి ఈశ్వరీ రావ్, కొడుకు పాత్రలో దిలీపన్ నటించారు తమిళ నటుడు సముద్రఖని, నానా పటేకర్, బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి, హిందీ నటి అంజలి పాటిల్ కీలక పాత్రలు పోషించారు. వండర్ బార్ ఫిలింస్ బేనర్‌పై ధనుష్ కాలా చిత్రాన్ని నిర్మించారు. ముంబై బ్యాక్ డ్రాప్లో రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.













