Jyothika: సూర్య వల్లే మళ్లీ సినిమాలు చేస్తున్నా
హీరో సూర్య(Suriya) ను పెళ్లి చేసుకున్న తర్వాత జ్యోతిక(Jyothika) కొన్నాళ్ల పాటూ సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. దీంతో అందరూ సూర్య మరియు అతని కుటుంబం జ్యోతికను సినిమాల్లోకి వద్దన్నారనుకున్నారంతా. రీసెంట్ గా జ్యోతిక ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. రీసెంట్ గా డబ్బా కార్టెల్(Dabba Kartel) వెబ్ సిరీస్ తో మంచి హిట్ అందుకున్న జ్యోతిక ఈ వయసులో కూడా తన సత్తా చాటుతోంది.
సైతాన్(Shaithan), డబ్బా కార్టెల్ విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న జ్యోతిక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో సూర్య మరియు అతని ఫ్యామిలీ తనను నటనలోకి వద్దన్నారని వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని ఆమె క్లారిటీ ఇచ్చింది. పెళ్లి తర్వాత తాను సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నప్పుడు మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడొస్తావని సూర్యనే తనను రెగ్యులర్ గా అడుగుతూ ఉండేవాడని జ్యోతిక తెలిపింది.
తాను చేసిన సినిమాలు టీవీ లో వచ్చేటప్పుడు సూర్యకు ఎలాంటి మెసేజెస్ వస్తాయో కూడా జ్యోతిక ఈ సందర్భంగా వెల్లడించింది. జ్యోతిక సినిమా టీవీలో వచ్చింది. ఆమె చాలా బాగా చేసింది. ఎందుకని ఆమెను సినిమాల్లో నటించనీయడం లేదని సూర్యకు కొంతమంది నుంచి వచ్చే మెసేజ్లను తనకు ఫార్వార్డ్ చేసేవాడని జ్యోతిక గుర్తుచేసుకుంది.













