నన్ను గైడ్ చేస్తున్న వ్యక్తి మీరు… నాకు సోదరుడి కంటే ఎక్కువ – ఎన్టీర్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్నదమ్ముల అనుబంధం అంటేనే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. మెగా బ్రదర్స్ విషయం లో కానీ, నందమూరి బ్రదర్స్ విషయం లో కానీ, హీరోగా ఏ ఒక్కరి స్థాయి ఎంత పెరిగినా కూడా చాలా మంది తమ్ముడు తమ్ముడే.. అన్నయ్య అన్నయ్యే.. అనే విధంగా నడుచుకుంటూ ఉంటారు. ఇక నందమూరి వారిలో వ్యక్తిగత అభిప్రాయ బేధాలు ఉన్నాయని కామెంట్స్ వచ్చినప్పటికీ నందమూరి హరి కృష్ణ తనయులు కళ్యాణ్ రామ్, ఎన్టీర్ లు మాత్రం ఎంతో ఆప్యాయంగా ఉంటారు. తమ్ముడి పుట్టిన రోజుకి అన్న శుభాకాంక్షలు చెపితే… అన్న పుట్టినరోజుకు తమ్ముడు ఎన్టీర్ బావోద్వేగంగా ఈ రోజు ట్వీట్ పెట్టాడు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ కూడా ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. “మీరు నాకు ఒక సోదరుడి కంటే ఎక్కువ. మీరు నాకు ఒక మంచి స్నేహితుడు. అలాగే ఒక తత్వవేత్త. అలాగే కొన్నేళ్ల పాటు నన్ను గైడ్ చేస్తున్న వ్యక్తి. నేడు మీ పుట్టినరోజు సందర్భంగా నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కళ్యాణ్ అన్నాఅలాగే మీరు నిజంగా చాలా బెస్ట్ ” అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఒకే ఫ్యామిలీకి చెందిన వారు మల్టీస్టారర్ సినిమాలు చేస్తే.. ఆ సినిమా ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా కలిస్తే నటిస్తే బావుంటుందని నందమూరి అభిమానులు చాలా కాలం నుంచి వేచి చూస్తన్నారు. గతంలో మల్టీస్టారర్ కథల కోసం వెతుకుతున్నట్లు కళ్యాణ్ రామ్ కూడా చెప్పాడు.బాబాయ్ బాలకృష్ణ కూడా మంచి కథ సెట్టయితే చేస్తానని అన్నాడు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే.