ఇద్దరి భామలతో ఆకట్టుకోనున్న భీమ్ ప్రేమాయణం
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో రిలీజ్ కానున్న ఈసినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ వల్ల లేట్ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్లు సినిమాపై అంచనాల్ని పెంచేయగా, ఇప్పుడొస్తున్న అప్డేట్స్ సినిమాపై అంచనాల్ని తారాస్థాయికి చేరుస్తున్నాయి.
అప్పట్లో ఎన్టీఆర్, పులితో చేసే ఫైట్ ఆద్యంతం ఆసక్తి కలిగిస్తుందని చెప్పారు. ఇప్పుడు భీమ్ క్యారెక్టర్ లవ్ స్టోరీ ఎంతో గొప్పగా ఉంటుందని లీక్ అయింది. అప్పట్లో బ్రిటీష్ వాళ్లకి ఎదురెళ్లి పోరాడి మరణించిన గిరిజన వీరుడు కొమరం భీమ్ జీవితంలో ఇద్దరు మహిళలున్నారు. అందులో ఒకరు బ్రిటీష్ యువతి కాగా మరొకరు గిరిజన యువతి. ఆ ఇద్దరితో భీమ్ ప్రేమాయణం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట.
అడవి జాతి ముద్దుబిడ్డ భీమ్ లవ్ స్టోరీ చరిత్ర లో ఉంది. దాన్ని తెరపై ఎంతో అద్భుతకావ్యంలా తీర్చిదిద్దాడట జక్కన్న. ఇద్దరు హీరోయిన్లతో ఎన్టీఆర్ ప్రేమ కథ ఎంతో రక్తి కట్టిస్తుందని చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో దేశభక్తుడిగా అజయ్ దేవగన్ నటిస్తుంటే, సముద్రఖని, శ్రియ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ కు కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.













