ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మధ్య ‘రేడియేషన్’
ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబినేషన్లోఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కల్యాణ్‌రామ్, చినబాబు నిర్మిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు `అయిననూ పోయి రావలె హస్తినకు` అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు ఇంతకుముందే వార్తలు వచ్చాయి. అయితే అదే టైటిల్‌ను కన్ఫర్మ్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాలో మొదటిసారి ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉండబోతోంది. త్రివిక్రమ్ కెరీర్లో కూడా రాజకీయ నేపథ్యంలో సినిమా చేయడం ఇదే ప్రథమం అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. `కె.జి.ఎఫ్` చిత్రంతో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కాంబినేషన్లో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడంటే ప్రేక్షకుల్లో, ఎన్టీఆర్ అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. వారి అంచనాలకు తగ్గట్టుగా, ఎన్టీఆర్ ఇమేజ్‌కి సూట్ అయ్యే అద్భుతమైన కథను ప్రశాంత్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి `రేడియేషన్` అనే టైటిల్ పెట్టే అవకాశం ఉన్నట్టు ప్రశాంత్ మాటల్ని బట్టి తెలుస్తోంది.
ఇటీవల ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పాడు ప్రశాంత్. ఆ సందర్భంలోనే ఇద్దరూ కలిసి సినిమా చేయబోతున్నట్లు వారి ట్వీట్ల ద్వారా తెలిసింది. `త్వరలోనే రేడియేషన్ సూట్‌తో మీ దగ్గరకు రాబోతున్నాను` అని ప్రశాంత్ ట్వీట్ చేయగా..జూన్ 4న ప్రశాంత్ నీల్ పుట్టినరోజు పురస్కరించుకొని మైత్రీ మూవీ మేకర్స్.. `గొప్ప మనసు కలిగిన దర్శకుడికి శుభాకాంక్షలు` అంటూ `త్వరలో మిమ్మల్ని రేడియేషన్ సూట్లో కలవబోతున్నాం` అంటూ ట్వీట్ చేసారు. ఈ రెండు ట్వీట్స్ బట్టి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాకు `రేడియేషన్` అనే టైటిల్‌ను ఫిక్స్ చేయబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ సినిమాను న్యూక్లియర్ ప్లాంట్స్‌తో పాటు పర్యావరణ నేపథ్యంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కబోతున్నట్టు సమాచారం.
కెజిఎఫ్‌లో హీరో ఎలివేషన్ ఓ రేంజ్లో ఉంటుంది. మరి ఆ లెక్కన ఎన్టీఆర్ క్యారెక్టర్ని ఎంత పవర్‌ఫుల్‌గా డిజైన్ చెయ్యాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రశాంత్ అదే పనిలో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఎనౌన్స్మెంట్ మాత్రం త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.













