మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం మిష్టర్ మజ్ను. నిధి అగర్వాల్ నాయికగా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకుడు. థమన్ సంగీతం అందించిన మిస్టర్ మజ్ను పాటలు ఇప్పటికే విడుదల శ్రోతల ఆదరణ పొందుతున్నాయి. ఘనంగా సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం జరగనుంది. ఈ నెల 19న హైదరాబాద్లో నిర్వహించనున్న మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నెల 25వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.













