అన్న కోసం తమ్ముడు అతిథి!
నందమూరి సోదరులు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఒకే వేదికపై సందడి చేయనున్నారు. కల్యాణ్‌రామ్ మోహరీన్ జంటగా నటించిన చిత్రం ఎంత మంచివాడవురా. సంక్రాంతి కానుకగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఎనిమిదో తేదీన హైదరాబాద్‌లో జరగనుంది. దీనికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అన్నదమ్ములను ఒకే వేదికపై చూసేందుకు సిద్ధం కండి అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కుటుంబ కథ, కమర్షియల్ అంశాలతో సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ఆదిత్యా మ్యూజిక్ సంస్థ నిర్మించిన సినిమా ఇది.













