చిరూ ఆచార్యలో మరో విలన్! ఎవరంటే..?
చిరూ, కొరటాల కాంబినేషన్యం తెరకెక్కుతున్న భారీ చిత్రం ఆచార్య. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. ఇందులో చిరూ సరసన కాజల్ నటిస్తుంటే.. చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది.
ప్రస్తుతం ఈస్ట్ మారేడుమిల్లిలో చిరూ పై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. సోనూసూద్ ఈ సినిమాలో విలన్ గా కీలకపాత్ర చేయనున్న విషయం విదితమే. అప్పట్లో సోనూసూద్ పై కీ షాట్స్ ను కూడా చిత్రీకరించారు. అయితే ఇప్పుడు ఆచార్య కు సంబంధించిన మరో వార్త హల్ చల్ చేస్తుంది.
అదేంటంటే.. ఈ సినిమాలో సోనూసూద్ తో పాటు మరో విలన్ కూడా కనిపిస్తాడట. అతను మరెవరో కాదు.. నాగశౌర్య నటించిన అశ్వథ్థామ సినిమాలో క్రైమ్ విలన్ గా కనిపించి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న బెంగాళీ నటుడు జిష్ను సేన్ గుప్తా. ఆ తర్వాత భీష్మ లో కూడా విలన్ గా మెప్పించాడు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ మూవీలో మెగా ఛాన్స్ దక్కించుకున్నాడని తెలుస్తుంది. మణిశర్మ సంగీతమందించనున్నఈ సినిమా మే13న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు మూవీ యూనిట్.













