Genelia: రీఎంట్రీ టైమ్ లో జెన్నీ పడ్డ ఇబ్బందులు
తుజే మేరీ కసమ్(Tuje meri kasam) మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జెనీలియా(Genelia) తెలుగులో సై(Sye), బొమ్మరిల్లు(Bommarillu), ఆరెంజ్ (Orange), రెడీ(Ready) లాంటి ఎన్నో గుర్తుండిపోయే సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక క్రేజ్ ను సంపాదించుకుంది. తెలుగులో సిద్ధార్థ్ తో కలిసి చేసిన బొమ్మరిల్లు సినిమాతో జెన్నీ బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత రితేష్ దేశ్ముఖ్(Ritesh Deshmukh) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న జెనీలియా పదేళ్ల పాటూ సినిమాలకు దూరంగా ఉంది.
పదేళ్ల బ్రేక్ తర్వాత తిరిగి సినిమాల్లోకి వద్దామనుకున్నప్పుడు తనకు తెలిసిన వాళ్లెవరూ తనను ప్రోత్సహించలేదని, పదేళ్ల తర్వాత తిరిగి సినిమాల్లోకి వస్తున్నావా? అసలు ఇది వర్కవుట్ అవుతుందా అన్నారని, ఆ మాటలు తననెంతో బాధించాయని జెనీలియా తెలిపింది. అయితే ఎవరెన్ని చెప్పినా తాను తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చానని జెనీలియా చెప్పింది.
రితేష్ తో కలిసి తాను రీఎంట్రీ ఇచ్చిన వేద్(Vedh) సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయిందని, అందుకే అన్ని విషయాల్లో వేరే వాళ్లను నమ్మడానికి లేదని జెన్నీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. అయితే వేద్ మూవీ నాగచైతన్య(Naga Chaitanya), సమంత(Samantha) కలిసి నటించిన మజిలీ(majili) సినిమాకు రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జెనీలియా గృహిణి పాత్రలో చాలా మంచి నటనను కనబరించిందని ప్రశంసలు కూడా అందుకుంది.













