Jayaram: కాంతార ఛాన్స్ ఎలా వచ్చిందంటే?

కాంతార(kanthara) సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రిషబ్ శెట్టి(rishab shetty). కాంతార హిట్టవడంతో దానికి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్1(kantharar1) తీసి రీసెంట్ గా ఆ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. కాంతార కంటే కాంతార1 భారీ బడ్జెట్ తో తెరకెక్కగా, ఆ ఖర్చుకు తగ్గట్టే కాంతార1 బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తో సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తుంది.
మంచి కలెక్షన్లను అందుకుంటున్న కాంతార1 లో రుక్మిణి వసంత్(rukmini vasanth) హీరోయిన్ గా నటించగా, జయరామ్(jayaram) నెగిటివ్ రోల్ లో నటించి, జయరాం నెగిటివ్ రోల్ లో కనిపించి మెప్పించాడు. మూవీ ఆరంభంలో చాలా మామూలుగా కనిపించిన అతని పాత్ర, క్లైమాక్స్ లో మాత్రం నట విశ్వరూపం చూపించాడు. రీసెంట్ టైమ్స్ లో జయరామ్ నుంచి వచ్చిన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదేనని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే అసలు కాంతార1 లో తనకు అవకాశం ఎలా వచ్చిందనే విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు జయరామ్. కాంతర మూవీ చూసి షాకై, రిషబ్ ను కంగ్రాట్యులేట్ చేయడానికి కాల్ చేస్తే, తాను నాకు పెద్ద ఫ్యాన్ ని అని, నా సినిమాలు చూస్తూనే పెరిగానని చెప్పాడని, రిషబ్ ఫ్యామిలీ కేరళ- కర్ణాటక బోర్డర్ లో చాలా కాలం ఉండటంతో కన్నడతో పాటూ మలయాళ సినిమాలు కూడా చూసేవాడినని చెప్పాడని, ఆ తర్వాత కొంత టైమ్ కు రిషబ్ తనకు కాల్ చేసి కాంతార1 కథ చెప్పి, ఈ సినిమాలో నటించమని అడిగాడని, రిషబ్ అడగ్గానే ఏమీ ఆలోచించకుండానే వెంటనే ఒప్పుకున్నానని జయరామ్ చెప్పుకొచ్చారు.