తన పాత్ర గురించి లీకిచ్చిన జాన్వీ
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న దేవర1 కోసం ఫ్యాన్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సాంగ్ నుంచి రిలీజైన ఫియర్ సాంగ్ కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మిగిలిన పాటలు దీనికి మించేలా ఉంటాయని అనిరుధ్ దేవరకు మంచి ట్యూన్స్ ఇచ్చాడని ఇప్పటికే టాక్ వచ్చింది.
ఈ సినిమా ద్వారా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ టాలీవుడ్ కు పరిచయం కానుంది. జాన్వీ తన బాలీవుడ్ మూవీ ఉలజ్ ప్రమోషన్స్ లో భాగంగా దేవర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దేవరలో తన క్యారెక్టర్ బీచ్ ఒడ్డున ఆడుతూ పాడుతూ రొమాన్స్ చేస్తూ ఎంతో సరదాగా ఉంటుందని, ఫస్ట్ పార్ట్ లో కంటే సెకండ్ పార్ట్ లోనే తన క్యారెక్టర్ ఎక్కువగా రివీలవుతుందని ట్విస్ట్ ఇచ్చింది జాన్వీ.
దీన్ని బట్టి చూస్తుంటే దేవర పార్ట్ 1 లో జాన్వీ కేవలం పాటలకే పరిమితమయ్యేట్లు అనిపిస్తుంది. జూ. ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేయడం చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పిన జాన్వీ, దేవర పార్ట్1 కు సంబంధించి మరో సాంగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు చెప్పింది. సిట్యుయేషన్ ఏదైనా సరే జాన్వీ మాత్రం దేవర గురించి మాట్లాడుతుంది. చూస్తుంటే అమ్మడికి టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడవుతుందా అని చాలా ఎగ్జయింట్ గా అనిపిస్తున్నట్లుంది.













