Janhvi Kapoor: పెళ్లి ప్లానింగ్ కు ఇంకా చాలా టైముంది

ఇటీవలే పరమ్ సుందరి(param sundari) తో ఆడియన్స్ ముందుకొచ్చిన జాన్వీ కపూర్(janhvi kapoor) ఇప్పుడు సన్నీ సంస్కారీకి తులసి కుమారి(sunny sanskari ki tulsi kumari) ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ జరగ్గా ఆ ఈవెంట్ కు వరుణ్ ధావన్(varun dhawan), సన్యా మల్హోత్రా(sanya malhotra), జాన్వీ కపూర్, మనీష్ పాల్(manish paul) హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా జాన్వీకి పెళ్లి గురించి, పెళ్లి ప్లానింగ్ గురించి ప్రశ్న ఎదురైంది.
దానికి జాన్వీ సమాధానమిస్తూ ప్రెజెంట్ తన ప్లానింగ్ మొత్తం సినిమాలపైనే ఉందని, పెళ్లి కోసం ప్లానింగ్స్ చేయడానికి ఇంకా చాలా సమయముందని ఆమె చెప్పారు. కాగా జాన్వీ కపూర్ కొంత కాలంగా శిఖర్ పహారియా(sikhar pahariya)తో రిలేషన్ లో ఉందన్న సంగతి తెలిసిందే. వారిద్దరూ కలిసి ఇప్పటికే ఎన్నో ఈవెంట్స్ లో కనిపించడంతో పాటూ బహిరంగంగా కూడా కనిపించారు.
శిఖర్ పహారియా పేరుతో ఉన్న నెక్లెస్ ను జాన్వీ మెడలో ధరించి కూడా కనిపించింది. కానీ ఇప్పటివరకు తమ బంధాన్ని మాత్రం జాన్వీ ఎప్పుడూ బయటపెట్టలేదు. ఎలాగూ రిలేష్ లో ఉంది కాబట్టి త్వరలోనే జాన్వీ పెళ్లి చేసుకుంటుందేమో అని అందరూ అనుకుంటే తాను మాత్రం ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేమీ లేవని చాలా స్పష్టంగా చెప్పేసింది. కాగా ప్రస్తుతం జాన్వీ బాలీవుడ్ తో పాటూ తెలుగులోనూ సినిమాలు చేస్తుంది. రామ్ చరణ్(ram charan) తో పెద్ది(peddi), అల్లు అర్జున్(allu arjun)- అట్లీ(Atlee) మూవీతో పాటూ దేవర2(Devara2) కూడా జాన్వీ లైనప్ లో ఉన్నాయి.