సలార్ గురించి జగపతిబాబు కీలక వ్యాఖ్యలు
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా వచ్చిన ఆదిపురుష్ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్ పైనే పెట్టుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. ఈ సినిమా రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.
కేజీఎఫ్ సినిమాతో యశ్ కు కెరీర్లోనే బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ప్రశాంత్ నీల్ సలార్ లో ప్రభాస్ ని ఎలా చూపిస్తాడా అని అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి జగపతిబాబు బాంబు పేల్చాడు. గతంలో ఓ సారి తను సలార్ షూటింగ్ లో కేవలం 5 రోజులు మాత్రమే పాల్గొన్నానన్న జగపతిబాబు, ఇప్పుడు తనకు, ప్రభాస్ కు మధ్య ఒక్క సీన్ కూడా ఉండదని చెప్పడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
సలార్ లో జగపతిబాబు మెయిన్ విలన్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల అందరికీ అనుమానాలొస్తున్నాయి. సలార్ సినిమా రెండు భాగాలుగా వస్తుంది కాబట్టి రెండో భాగంలో వీరి మధ్య సీన్స్ ఉండే ఛాన్స్ ఉంది. కేజీఎఫ్‌లో కూడా మెయిన్ విలన్ తో హీరో రెండో పార్ట్ లోనే పోటీ పడతాడు. ఇప్పుడు జగపతిబాబు క్యారెక్టర్ కూడా అలానే ఉండి ఉండొచ్చు. కాగా సలార్ మొదటి భాగం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.













