దర్శకుడిగా మారుతున్న కిర్రాక్ ఆర్పీ
జబర్దస్త్ కామెడీ షోతో కిర్రాక్ ఆర్పీగా జబర్దస్త్ షో లో ఆర్పీకి మంచి గుర్తింపు వచ్చింది. కొన్ని సినిమాల్లో కూడా కమెడియన్ గా చేసాడు. నెల్లూరులో కిరాక్ ఆర్పీ ఈవెంట్స్ కూడా స్టార్ట్ చేసాడు. కానీ మెగాబ్రదర్ నాగబాబు ఈ టివి జబర్దస్త్ షో నుండి తప్పుకోవడంతో ఆర్పీ కూడా తప్పుకున్నాడు. నాగబాబు వెంట నడుస్తూ జీ తెలుగులో వస్తున్న అదిరింది షోకి వెళ్ళాడు. అయితే కొన్ని రోజులుగా అతడి స్కిట్స్ రావడం లేదు. ఈ నేపథ్యంలో అదిరిందిలో ఆర్పీకి, షో మేనేజ్మెంట్ కి గొడవలు ఏమైనా వచ్చాయా అని అందరూ అనుకున్నారు.కానీ అలాంటిదేమి లేదంటూ ఇటీవలే ఆర్పీ ప్రకటించి త్వరలో తాను దర్శకుడిగా మారబోతున్నాను అంటూ సన్నిహితులకు తెలిపాడు. అతడు చెప్పిన కథ నచ్చి సినిమా తీయడానికి ఒక నిర్మాత ముందుకు రావడంతో తాత్కాలికంగా నటనకు విరామం ఇచ్చి స్టోరీ, స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాను అని తెలిపాడు. ఈ నెలలోనే సినిమా షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాను,
డైరెక్షన్ చేసే అవకాశం రావడంతో స్కిట్స్ చేయడం ప్రస్తుతానికి ఆపేశానని కిరాక్ ఆర్పీ చెప్పాడుఇలా చెప్పిన రెండు రోజులకే తన సినిమాని పట్టాలెక్కించేసాడు. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు. కిరాక్ ఆర్పీ మొదట డైరెక్షన్ డిపార్ట్మెంట్. బాగా నటిస్తుండటంతో టీం లీడర్ అయి కమెడియన్ గా మారాడు. తాజాగా ఇవాళ జేడీ చక్రవర్తి హీరోగా, ప్రకాశ్ రాజ్, రావు రమేష్ లాంటి పెద్ద ఆర్టిస్టులతో కిరాక్ ఆర్పీ సినిమా చేస్తున్నాను అని ప్రకటించి,పూజా కార్యక్రమాలు చేసారు. శ్రీ పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై కోవూరు అరుణాచలం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇవాళ జరగగా, కార్యక్రమానికి నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంగా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కుదరడంతో దర్శకునిగా ఆడియెన్స్ ముందుకి రావడానికి నిశ్చయించుకున్నాను అని ఆర్పీ అన్నారు. హీరో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ కిరాక్ ఆర్పీ చెప్పిన కథ నాకు నచ్చడంతో ఈ సినిమాకి ఒప్పుకున్నాను అని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో హైదరాబాద్, నెల్లూర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిపారు కిరాక్ ఆర్పీ. ఈ సినిమాకి చరణ్ అర్జున్ సంగీతం సమకూరుస్తున్నారు.













