OG2: ఓజి2 మొదలయ్యేది అప్పుడేనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) నటించిన ఓజి(OG) సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. సుజిత్(sujeeth) దర్శకత్వంలో వచ్చిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా ఎంతో కాలంగా మంచి ఆకలితో ఉన్న పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టడమే కాకుండా మంచి సక్సెస్ ను కూడా అందుకుంది.
ఇదిలా ఉంటే ఓజి మూవీ క్లైమాక్స్ లో ఈ సినిమాకు సీక్వెల్ గా ఓజి2 ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. థియేటర్లలో ఓజి2(OG2) అని ఎండ్ కార్డ్ చూసినప్పుడు ఫ్యాన్స్ లో కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. సుజిత్ తో మరో సినిమా, అది కూడా ఓజికి సీక్వెల్ అని ముచ్చటపడిన ఫ్యాన్స్ నిజంగానే ఓజి2 ఉంటుందా అని కాస్త ఆలోచనలో కూడా పడ్డారు.
కానీ పవన్ కూడా ఓజి2 ఉంటుందని మీడియా ముఖంగా చెప్పడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఓజి2 వచ్చే ఏడాది ఆఖరిలో మొదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ లోగా సుజిత్, నేచురల్ స్టార్ నాని(nani)తో సినిమాను చేయాల్సి ఉండగా, పవన్ కూడా ఈ గ్యాప్ లో మరో ప్రాజెక్టు చేయనున్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది చూడాలి.






