మహేష్, త్రివిక్రమ్ హ్యా్ట్రిక్ మూవీకి సంబంధించి వస్తున్న వార్తల్లో నిజం లేదట?
సూపర్‌స్టార్ మహేష్ తను ఎంపిక చేసుకునే సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. అతను పూర్తిగా డైరెక్టర్స్ హీరో. మహేష్‌తో సినిమాలు చేసే డైరెక్టర్లు ఎంతో కంఫర్టబుల్‌గా ఉంటారు. డైరెక్టర్ ఏది చెబితే అది చేయడానికి మహేష్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అలాంటి మహేష్ వరసగా ఏ డైరెక్టర్‌తోనూ మూడు సినిమాలు చేయలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ఘనత గుణశేఖర్ ఒక్కడికే దక్కింది. ఒక్కడు, అర్జున్, సైనికుడు.. మూడు సినిమాలు వరసగా గుణశేఖర్ దర్శకత్వంలో చేసాడు. మిగిలిన డైరెక్టర్స్‌కి ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే చేశాడు. పోకిరితో తనను సూపర్‌స్టార్‌ని చేసిన పూరి జగన్నాథ్‌కి కూడా రెండు సినిమాలు మాత్రమే చేశాడు. మహేష్, గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన సైనికుడు రిలీజ్ అయి 14 సంవత్సరాలు దాటుతోంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకే దర్శకుడితో మూడు సినిమాలు చేయలేదు మహేష్. ఇప్పుడు ఒక డైరెక్టర్‌తో హ్యాట్రిక్ మూవీ చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. మహేష్‌తో అతడు, ఖలేజా చిత్రాలను రూపొందించిన త్రివిక్రమ్ కాంబినేషన్లో హ్యా్ట్రిక్ మూవీ ఉంటుందని ఈమధ్య సోషల్ మీడియాలో అప్డేట్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట సినిమా చేస్తున్న మహేష్ తన తర్వాతి సినిమా రాజమౌళి దర్శకత్వంలో ఉంటుందని ప్రకటించాడు. అలాగే రాజమౌళి కూడా తను ప్రస్తుతం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత మహేష్‌తో సినిమా చేస్తానని ఎనౌన్స్ చేశాడు. ఇదిలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్ ఆర్ ఆర్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేకపోతున్నారు. త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌కి రావాలంటే ఎన్టీఆర్‌కు ఇంకా చాలా టైమ్ పడుతుందని సమాచారం. అందులో ఈలోగా సర్కారువారి పాట ఫినిష్ చేస్తే మహేష్‌తోనే తన నెక్స్ట్ మూవీ చెయ్యొచ్చని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడని అంతా అనుకున్నారు. నవంబర్ 7న త్రివిక్రమ్ పుట్టినరోజు. ఆరోజు మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో చేయబోయే సినిమాకి సంబంధించి అప్డేట్ వస్తుందని అందరూ ఎదురుచూశారు. కానీ, రాలేదు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా లేదనే క్లారిటీకి వచ్చేశారు ఫ్యాన్స్. ఇప్పటికే ఈ వార్త వైరల్ అయిపోయింది. అయితే సర్కారు వారి పాట తర్వాత మహేష్ చేసే సినిమా త్రివిక్రమ్‌దేనని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
నిన్న, ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదనేది దీన్నిబట్టి అర్థమవుతోంది. సర్కారువారి పాట షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది, మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్.. ఇలా ఎవరైనా తమ నెక్సట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయాన్ని క్లారిటీగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఏది ఏమైనా మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ ఉంటుందనేది అభిమానులకు సంతోషాన్ని కలిగించే వార్తే.













