జగదీశ్ దానేటికి దక్కిన హాలీవుడ్ ఛాన్స్
హాలీవుడ్ సినిమాల్లో ప్రవేశమే చాలా కష్టమని అంటారు. కాని మన తెలుగువాడైన దర్శకుడు, రచయిత జగదీశ్‌కు ఈ హాలీవుడ్ ఛాన్స్ లభించింది. తెలుగు చిత్రపరిశ్రమలో రచయితగా, దర్శకునిగా అనుభవం గడించిన జగదీశ్ అంతర్జాతీయ చిత్రాలకు ‘క్రియేటివ్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. తాజాగా ఆయన ‘మార్టిన్ ఫిల్మ్స్’ వంటి హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో కలసి నిర్మాణంలోకి దిగుతున్నారు. ‘ది హ్యాంగ్‌మ్యాన్’, ‘ వెంజెన్స్ ఎ లవ్‌స్టోరీ’, ‘ఐ యామ్ ప్రాత్’ వంటి చిత్రాలు నిర్మించిన హాలీవుడ్ దిగ్గజం జానీ మార్టిన్ ఈ తెలుగు దర్శకుడికి స్వాగతం పలుకుతూ , జగదీశ్‌తో కలసి హాలీవుడ్ చిత్రాలు నిర్మించనున్నట్లు ఇటీవల లాస్ఏంజిల్స్లో ప్రకటించింది. పలు రకాల ప్రాజెక్టులు ఖరారయ్యాయనీ, హాలీవుడ్ స్టార్స్, కొంతమంది భారతీయ నటులు ఆ చిత్రాల్లో నటిస్తారనీ జగదీశ్ చెప్పారు.













