పుష్ప కి షాకిచ్చిన పఠాన్…!
చిత్ర పరిశ్రమలో న్యూ ఇయర్ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. 2023 లో కొత్త సినిమాల హంగామా మొదలైంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా థియేటర్లలోకి పలు క్రేజీ సినిమాలు సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి బరిలో క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాటు పలు పాన్ ఇండియా సినిమాలు పోటీపోటీగా రిలీజ్ కాబోతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది లాగానే IMDB 2023 మూవీ లిస్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. మూవీ డేటాబేస్ వేదికైన IMDB సినిమాల లిస్ట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ లిస్ట్ ఇండస్ట్రీ లో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పాలి. లిస్ట్ లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటిస్తున్న థ్రిల్లర్ “పఠాన్” మొదటి ప్లేస్ ని దక్కించుకోవడం విశేషం. ఈ మూవీని ప్రకటించిన దగ్గరి నుంచి రోజుకొక వివాదంతో, కాంట్రావెర్సీ తో ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది.
పఠాన్ సినిమాకి సంబంధించిన టీజర్ లో హీరో, హీరోయిన్లు అయిన దీపకా, షారుక్ ల బీచ్ సాంగ్ ట్రోలింగ్ కు గురి కావడం అందరికి తెలిసిన విషయమే. సెన్సార్ బోర్డు కూడ ఈ సినిమా టీం కి షాక్ ఇచ్చింది. ఇన్ని అడ్డంకుల మధ్య 2023లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల జాబితాలో IMDB వేదికగా ప్రధమ స్థానాన్ని `పఠాన్` మూవీ సొంతం చేసుకోవడం విశేషం.
అసలు విషయం ఏంటంటే ఈ స్థాయిలో వివాదాల “పఠాన్” పాన్ ఇండియా వైడ్ గా సంచలనాలు సృష్టించిన బన్నీ సినిమా “పుష్ప” కు సీక్వెల్ గా రూపొందుతున్న “పుష్ప 2 ” ని వెనక్కు నెట్టడం ప్రేక్షకులకి షాకింగ్ అనే చెప్పాలి. ఇక రెండవ స్థానంలో స్థానంలో `పుష్ప ది రూల్` నిలిచింది. 2023 IMDB లిస్ట్ లో పలు సినిమాలు చోటు సాధించాయి. “పఠాన్, పుష్ప 2, ఆది పురుష్, సలార్, వారీసు, కబ్జ” తో పాటు పలు బాలీవుడ్ సినిమాలున్నాయి.













