ఇలియానాకు ఇదే తొలిసారి!
దేవదాసు చిత్రంతో 2005లో కథానాయికగా అరంగేట్రం చేసింది ఇలియానా. ఈ పదమూడేళ్లలో పదిహేను తెలుగు చిత్రాల్లో నటించింది. కానీ ఒక్కసారి కూడా తెలుగులో డబ్బింగ్ చెప్పుకోలేకపోయింది. తొలిసారి అమర్ అక్బర్ ఆంటోని కోసం ఆ ప్రయత్నం చేసింది. తన పాత్రకు తానే గొంతు ఇచ్చుకుంది. రవిజేత కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శ్రీనువైట్ల దర్శకుడు. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది. ఈ నెల 16న విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ పాత్ర డిమాండ్ చేయడం వల్ల ఇలియానే డబ్బింగ్ చెప్పుకొంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఇలియానా తన డబ్బింగ్ పూర్తి చేసింది. ఆమె గొంతు ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందన్నారు. సంగీతం: తమన్.













