దుల్కర్ ఛీట్ చేస్తే సినిమా హిట్టే!
మలయాళంతో పాటూ తెలుగులో కూడా దుల్కర్ సల్మాన్(Dulquer Salman) కు క్రేజ్ పెరుగుతుంది. ఒకప్పుడు తెలుగు సినిమాలను చేయడానికి ఇష్టపడని వాళ్లు ఇప్పుడు కోరి మరీ తెలుగు సినిమాలు చేస్తున్నారు. మహానటి(Mahanati), సీతారామం(SitaRamam) సినిమాలతో మంచి పునాది వేసుకున్న దుల్కర్ ఇప్పుడు లక్కీ భాస్కర్(Lucky Baskhar) తో మంచి హిట్ అందుకుని తన సత్తా చాటాడు.
90ల్లో మనీ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో దుల్కర్ బ్యాంక్ ఎంప్లాయిగా మంచి నటనను కనబరిచాడు. అయితే చూడ్డానికి మంచివాడిగా, అమాయకంగా కనిపించే దుల్కర్ స్క్రీన్ పై మోసం చేసేవాడిగా కనిపిస్తే మాత్రం సినిమా సూపర్‌హిట్ అని డైరెక్టర్లు నమ్ముతున్నారు.
కురుప్(Kurup) లో తను చేసిన ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం నుంచి దేశవిదేశాలు వెతికే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారడం, కనులు కనులు దోచాయంటే(Kanulu Kanulu Dochayante) మూవీలో టెక్నాలజీని వాడుకుని జనాన్ని మోసం చేయడం, ఇప్పుడు లక్కీ భాస్కర్ లో పని చేసే బ్యాంకుకే కన్నాలేసి కోట్లు పోగేయడం.. ఈ పాత్రలన్నీ మోసం చేసేవే. లవర్ బాయ్ గా కనిపించే దుల్కర్ కన్నింగ్ పాత్రలో ఎంతగా మెప్పించగలడో ప్రతీసారీ నిరూపించుకుంటున్నాడు. దుల్కర్ నెక్ట్స్ పవన్ సాధినేని(Pavan Sadhineni) దర్శకత్వంలో మరో కంటెంట్ బేస్డ్ మూవీ చేయనున్నాడు. చూస్తుంటే దుల్కర్ టాలీవుడ్ లో సెటిలై పోయేట్లున్నాడు.













