ఇచ్చట వాహనములు నిలుపరాదు ..లైన్ క్లియర్
హీరో సుశాంత్ తాజా చిత్రం ఇచ్చట వాహనములు నిలుపరాదు. నో పార్కింగ్ అన్నది ఉపశీర్షిక. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ ను ఎక్కువగా చేస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యుబైఎ సర్టిఫికెట్ అందుకుంది. ఆగస్టు 27న విడుదల కానుంది. ఫ్రెష్ కంటెంట్, యాక్షన్ రొమాన్స్, సహా ఇతర అంశాలతో ఈ చిత్రాన్ని కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందించిన యూనిట్‌కు సెన్సార్ సభ్యులు అభినందించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. నటి భానుమతి రామకృష్ణ మనుమడు రశిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయల గుండ్లతో కలిసి ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం పాత్రలు ఎంటర్టైన్ చేయనున్నాయని మేకర్స్ తెలిపారు.













