రెహమాన్ డిమాండ్ మామూలుగా లేదుగా
ఒకప్పటి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్లు ఈ జెనరేషన్ కు తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వడమంటే కష్టమైన పనే. జెనరేషన్ గ్యాప్ వల్లో లేక కొత్త టాలెంట్ కు ధీటుగా ట్యూన్స్ ఇవ్వలేకపోవడం వల్లో కానీ అప్పటి మ్యూజిక్ డైరెక్టర్లు త్వరగా రిటైర్మెంట్ తీసుకున్నారు. పాతికేళ్ల కిందట స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లుగా ఉన్న కోటి, దేవా, ఎస్ ఏ రాజ్ కుమార్ ప్రస్తుతం ఛాన్సులు లేక రియాలిటీ షోలలో జడ్జ్మెంట్లు చెప్తున్నారు.
కీరవాణి ఇంకా ఫామ్ లోనే ఉన్నప్పటికీ రాజమౌళికి సినిమాలకు తప్ప వేరే సినిమాలకు బెస్ట్ వర్క్ ఇచ్చింది లేదు. కానీ రెహమాన్ మాత్రం ఇప్పటికీ వీళ్లందరికీ భిన్నంగా డిమాండ్ లో ఉండటం షాక్ ను కలిగిస్తుంది. ప్రస్తుతం ఆయన చేతిలో చాలానే సినిమాలున్నాయి. ధనుష్ రాయన్ త్వరలోనే రిలీజ్ కాబోతుంది. రణ్బీర్-సాయిపల్లవి కాంబోలో తెరకెక్కుతున్న రామాయణంకు రెహమానే సంగీతం అందించనున్నాడు.
కమల్-మణిరత్నం థగ్ లైఫ్, లాహోర్ 1947, జయం రవి జీనీ, ధనుష్ తేరే ఇష్క్ మేన్, విక్కీ కౌశల్ చావా అన్నీ రెహమాన్ అకౌంట్ లోనే ఉన్నాయి. ఇవి కాకుండా మరో రెండు మూడు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నట్లు టాక్. కెరీర్ స్టార్ట్ చేసి ముప్పై ఏళ్లవుతున్నా రెహమాన్ కు ఇన్ని సినిమాలొస్తున్నాయంటే ఆయన డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే నిర్మాతలు సైతం ఆయనకు రూ.10 కోట్ల పారితోషికం ఇవ్వడానికి కూడా వెనుకాడటం లేదు.













